Srikakulam జిల్లాలో వన్యప్రాణులు జనావాసాల్లోకి రావటం పెరిగిందని అయినా ప్రజలు భయపడొద్దని జిల్లా అటవీశాఖ అధికారి నరేంథిరన్ తెలిపారు. జిల్లాలో ఎలుగుబంట్లు, ఏనుగులు తిరుగుతున్నాయన్న డీఎఫ్ వో వన్యప్రాణులను భయపెడితే అవి ప్రజలపై దాడి చేసే అవకాశం ఉంటుందన్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వటం అవసరం అన్న డీఎఫ్ వో...ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవాలనుకుంటే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు.